Site icon NTV Telugu

Relationship: కాసులు కాదు కావాల్సింది.. కాస్తంత ప్రేముంటే చాలు

Cake

Cake

Relationship: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. ఇది చూసి మనం కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వుకుంటాం.. మరికొన్ని కొన్నిసార్లు తెలియకుండానే ఏడ్చేస్తుంటాం. కొన్ని వీడియోలు చూస్తే మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అవి మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అలా హృదయాలను ద్రవింపజేసే వీడియోలు చాలా ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అది చూసిన తర్వాత మీరు కూడా భావోద్వేగానికి లోనవుతారు. వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు బాగా కామెంట్లు చేస్తున్నారు.

Read Also:Siddharth-Aditi: ఇక్కడ పవిత్ర- నరేష్.. అక్కడ సిద్దార్థ్- అదితి.. పవిత్ర బంధమట

ఈ వైరల్ వీడియో ఇద్దరు అన్నదమ్ములది. ఇందులో అన్నయ్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. వీడియో చూస్తే వారిది చాలా పేద కుటుంబం అని అర్ధమవుతుంది. ఒక సాధారణ కేక్ కొనడానికి కూడా వారి వద్ద డబ్బు లేనట్లుంది. అయితే తమ్ముడి పుట్టినరోజును జరిపించేందుకు అన్నయ్య ఓ మార్గాన్ని కనుగొన్నాడు. రొట్టె పైన కూరగాయలు, చట్నీ పెట్టి తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా దానిపై రెండు కొవ్వొత్తులను వెలిగించాడు. అంతే కాకుండా అన్నయ్య.. తన తమ్ముడి కోసం పుట్టినరోజు పాట పాడాడు.

Read Also: MLC Elections Fake Votes: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై మరోసారి ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఎవ్రీథింగ్ అబౌట్ నేపాల్ అనే పేజీ ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. చాలా మంది నెటిజన్లు చాలా ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version