NTV Telugu Site icon

Pooja Hegde : ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన బుట్టబొమ్మ.. ఎన్ని కోట్లంటే?

Pooja Hegde (3)

Pooja Hegde (3)

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఒకటో, రెండో సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా బుట్ట బొమ్మ కొత్త ఇల్లు కొన్నదన్న విషయాన్ని కూడా పంచుకుంది.. తన కొత్త ఇంటికి సంబందించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

పూజా హెగ్డే తాజాగా కొత్త ఇల్లు కొన్నట్లు తెలుస్తుంది.. షాహిద్ కపూర్‌తో కలిసి త్వరలో రాబోయే చిత్రం ‘దేవా’లో కనిపించనున్న పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారారు … ఈ కొత్త ఇల్లు ముంబైలోని బాంద్రాలో ఉన్నది.. ఇప్పటికే అక్కడ చాలా మంది ప్రముఖుల ఇల్లు ఉన్నాయి.. ఇప్పుడు పూజా కొన్న ఇల్లు రూ.45 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.. గతంలో పూజా మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది..

4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన స్థలంలో సముద్రానికి దగ్గరలో ఉన్న ఈ కొత్త ఇంటికి పూజా మారారు.. ఇక పూజా సినిమాల కన్నా ఎక్కువగా వేకేషన్లు వెళ్తుంది.. రీసెంట్ గా గోవాకు వెళ్లిన ఈ అమ్మడు అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. తెలుగులో పెద్దగా సినిమాలు చెయ్యలేదని తెలుస్తుంది..

Show comments