Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఫుల్ బిజీగా ఉంది. అన్ని భాషల్లోనూ తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలున్నాయి. టాలీవుడ్ లో మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో నటిస్తున్న పూజ హిందీలోనూ రెండు చిత్రాలు చేస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రీకరణలో ఉంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లో ఆమె తన 32వ పుట్టినరోజును కూడా జరుపుకుంది.
Read Also: Ori Devuda Movie Review: ఓరి దేవుడా! రివ్యూ
ఇదిలా ఉంటే తాజాగా పూజా గాయపడినట్లు తెలుస్తోంది. చిత్రీకరణలో భాగంగా ఒక యూనిట్ నుంచి మరో యూనిట్ కు, ఒక నగరం నుంచి మరో నగరానికి చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో పూజ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఎంతలా అంటే తన కాలు దెబ్బ తగిలినా విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఆమెకు లేకుండా పోయింది. కాలుకు పట్టీ వేసుకొని ఆమెకు షూటింగ్ లో పాల్గొంటోంది.
Read Also: Karthi Sardar Movie: సర్దార్ సినిమా ఇలా ఉంటుందనుకోలేదు.. ట్విట్టర్ టాక్
తన కాలుకు దెబ్బ తగిలిందని పూజ నిన్న తెలిపింది. చీలమండలో చీలిక ఏర్పడిందని చెబుతూ బ్యాండేజీ వేసిన కాలు ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దాంతో, తను కొన్ని రోజులు షూటింగ్ కు దూరం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఒక రోజు కూడా తిరగకుండానే తను షూటింగ్ లొకేషన్ లో ప్రత్యక్షమైంది. కాలుకు బ్యాండేజీతోని మేకప్ రూమ్ లో ఉన్న ఫొటోను షేర్ చేసిన పూజా ‘షో నడవాల్సిందే’ అని క్యాప్షన్ ఇచ్చింది. కాలుకు దెబ్బ తగిలినా కూడా పని ఆపకుండా ముందుకెళుతుండడంతో పూజ అంకితభావంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
