NTV Telugu Site icon

Pooja Hegde : భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన బుట్టబొమ్మ

Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde : ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అని ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధేశ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అలా వైకుంఠపురం సినిమాల్లో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కొన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఒక్కసారిగా కనుమరుగైంది. వరుస ఫ్లాపులతో బుట్టబొమ్మ రేసులో వెనకపడిపోయింది. ఆమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. అదే సమయంలో తెలుగులో శ్రీలీలకి డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. అంతేకాదు గుంటూరు కారం సినిమా నుంచి గురూజీ కూడా తప్పించగా.. తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది పూజా హెగ్డేకు.

Read Also:Kanaka Durga Temple: మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళూరు భామ పూజా హెగ్డే వరుస ఫ్లాపులు ఆమెకు ఎదురైనా ఏమాత్రం అధైర్యపడకుండా కెరీర్‌లో విజయం కోసం ప్రయత్నాలు చేస్తుంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తన కెరీర్‌ను మలుపుతిప్పుతుందనే ఆశాభావంతో ఉంది పూజాహేగ్డే.

Read Also:MS Dhoni: ఓడినా, గెలిచినా.. అతడు తన ఆటిట్యూడ్‌ను మార్చుకోలేదు: ధోనీ

గతంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేసే ఆమె ప్రస్తుతం కాస్త దిగి వచ్చిందట. దళపతి విజయ్‌ సినిమాకు రెమ్యునరేషన్ భారీగా తగ్గించి తీసుకుందని తెలిపింది. ప్రస్తుతం పూజాహెగ్డేకు తమిళం, హిందీల్లో అవకాశాలు బాగానే వస్తున్నా.. తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్‌ చేయలేదు. తమిళంలో సూర్య 44 చిత్రంలో కూడా ఈ భామనే హీరోయిన్ గా ఖరారైంది. ఈ రెండు చిత్రాలు తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని, తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ఉంది పూజాహెగ్డే. ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఆమె తన బాయ్‌ఫ్రెండ్ రోహన్‌తో తరచూ తిరుగుతూ ఉంటుంది. పూజా హెగ్డే చాలాసార్లు కెమెరాకు చిక్కింది.

Show comments