Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde Love: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తోంది. నటుడు రోహన్ మెహ్రాతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు తెగ రూమర్స్ వినపడుతున్నాయి. వీరిద్దరూ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం, కలిసి కనిపించడం వంటి ఘటనలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
పూజా హెగ్డే ప్రస్తుతం తమిళంలో ‘జన నాయకన్’, హిందీలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాల విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాల కంటే ఆమె వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇకపోతే రోహన్ మెహ్రా, బాలీవుడ్ లెజెండరీ నటుడు వినోద్ మెహ్రా కుమారుడు. ఆయన తల్లి కిరణ్ మెహ్రా. రోహన్ చిన్నప్పుడే, 1990లో వినోద్ మెహ్రా మరణించడంతో తండ్రి స్టార్‌డమ్‌ను ఆయన ప్రత్యక్షంగా అనుభవించలేకపోయాడు.
Also Read
తండ్రి మరణం తర్వాత రోహన్ తన తల్లి, అమ్మమ్మ-తాతలతో కలిసి కెన్యాలోని మొంబాసాలో పెరిగాడు. తరువాత ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లి, ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చి నటనలో కెరీర్ ప్రారంభించాడు. రోహన్‌కు సోనియా మెహ్రా అనే అక్క కూడా ఉంది. ఆమె 2007లో ‘విక్టోరియా నం. 203’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 1991లో జన్మించిన రోహన్ మెహ్రా మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రానికి ఆయన సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
2018లో వచ్చిన ‘బజార్’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టేలతో కలిసి నటించాడు. స్టాక్ మార్కెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో రిజ్వాన్ అహ్మద్ పాత్రలో రోహన్ నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతో బెస్ట్ మేల్ డెబ్యూ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులనే ఎంచుకుంటూ ముందుకు సాగాడు. 2021లో ‘420 IPC’ అనే లీగల్ డ్రామా ద్వారా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాడు. అలాగే 2023లో వచ్చిన ‘కాలా’ వెబ్ సిరీస్‌లో కూడా నటించాడు. ఈ సిరీస్‌లో ఫైనాన్షియల్ క్రైమ్స్ నేపథ్యంలోని కథలో కనిపించాడు.
వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటపెట్టని రోహన్ మెహ్రా, గతంలో హీరోయిన్ తార సుతారియాతో లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉన్నాడు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’కి ముందే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు పూజా హెగ్డేతో రిలేషన్లో ఉన్నాడనే వార్తలతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారాడు. కొన్నిసార్లు కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ ఉండటం ఈ రూమర్స్‌కు బలం చేకూరుస్తోంది.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!