NTV Telugu Site icon

Pooja Hegde Dance: ఫ్రెండ్‌ సంగీత్‌లో డాన్స్ ఇరగదీసిన పూజా హెగ్డే.. వీడియోస్ వైరల్!

Pooja Hegde Dance

Pooja Hegde Dance

Pooja Hegde Shaking a Leg On Her Songs At Friend’s Sangeet: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన స్నేహితురాలి వివాహా వేడుకలో పూజా సందడి చేశారు. సంగీత్‌ కార్యక్రమంలో బుట్టబొమ్మ స్టెప్పులతో ఇరగదీశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దళపతి, పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ చిత్రంలోని ‘అర‌బిక్ కుత్తూ’ పాటకు బుట్టబొమ్మ డాన్స్ చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన ‘అలా వైకుంఠపురం’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు కూడా తన స్నేహితురాళ్లతో కలిసి డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Also Read: IND vs SA: టెస్టు అని ఎలా అనగలం?.. పిచ్‌ క్యురేటర్లపై స్టెయిన్‌ అసంతృప్తి!

పూజా హెగ్డే గతేడాది సల్మాన్ ఖాన్ సరసన ‘ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో కలిసి పూజా ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రానికి ‘దేవ’ అనే టైటిల్ పెట్టారు. పూజా హెగ్డే బాలీవుడ్‌లో హౌస్‌ఫుల్ 4, మొహెంజో దారో, సర్కస్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌ సినిమాలతో వరుస డిజాస్టర్స్ పడడంతో పూజకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. తెలుగులో ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజా.. ప్రస్తుతం ఒక్క మూవీ కూడా లేదు. దీంతో సోషల్ మీడియాలో అందాల జాతరకు తెరలేపి.. నానా హంగామా చేస్తున్నారు.

Show comments