NTV Telugu Site icon

Pooja Bedi : నాకు నటన రాదు.. అందుకే అందాలను ఎరవేశాను

New Project 2024 11 05t070804.031

New Project 2024 11 05t070804.031

Pooja Bedi : సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది నటీమణులు మాత్రమే తమలో ఉన్న లోటు పాట్లను ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలుగుతారు. కొంతమంది అంగీక‌రించేందుకు ధైర్యం చేస్తారు. అలా ఈ హీరోయిన్ నిజాన్ని అంగీక‌రించ‌డ‌మే గాక‌, దానికి కాస్త మసాలాను కూడా దట్టించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన FICCI ఫ్లో ఈవెంట్‌లో సీనియ‌ర్ న‌టి పూజా భేడీ తన బోల్డ్ స్టేట్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. నేను భయంకరమైన నటిని. నా పేలవమైన నటన నుండి దృష్టి మరల్చడానికి తరచుగా నా క్లీవేజీ ని ఉపయోగించే దానినంటూ ఆమె వ్యాఖ్యానించారు. తాను ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చానో వివరించిన పూజా బేడీ.. ఎప్పుడూ నటించాలని అనుకోలేదని చెప్పుకొచ్చింది. నా మొదటి సినిమా అనుకోకుండా అలా కుదిరేసింది. నాకు డబ్బు అవసరం కాబట్టి నేను జో జీతా వోహీ సికందర్ (1992) మాత్రమే చేశానంటూ చెప్పుకొచ్చింది.

Read Also:CM Revanth Reddy : గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది

ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ ఫిల్మ్‌లో అమీర్ ఖాన్ హీరో. మార్లిన్ మన్రో స్టైల్ పోజ్‌తో పాటు పూజా ఎరుపు రంగు దుస్తులు త‌న‌ తొలి ప్రదర్శన ఇచ్చింది. ఈ సినిమాతో శృంగార తార సింబల్ అని కూడా త‌న‌కు ట్యాగ్ ఇచ్చారు. దీనిపై పూజా మాట్లాడుతూ.. ప్రారంభం ఆ లేబుల్‌తో అసౌకర్యంగా ఉన్నాను. కానీ నన్ను అలా అని పిలుస్తానంటే.. ఆ పిలుపును సొంతం చేసుకోవచ్చని ..ఈ రంగంలో దానివ‌ల్ల అత్యుత్తమంగా ఉండవచ్చని భావించిన‌ట్టు పూజా తెలిపారు. పూజా బేడీ ప్రముఖ నటుడు కబీర్ బేడీ కుమార్తె .. ఒక యంగ్ హీరోయిన్ కి తల్లి కూడా. ఆలయ ఎఫ్ త‌న కుమార్తె. త‌న గారాల ప‌ట్టీ గురించి పూజా ఈ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. అలయ ఉదయం 6 గంటలకు మేల్కొంటుంది. ముందుగా రోజులో ఏం చేయాలనేది షెడ్యూల్‌ను తెలుసుకుంటుంది. తన పనిపై పూర్తిగా దృష్టి సారిస్తుంది. ఏదీ ఆమె దృష్టిని మరల్చలేదని తెలిపారు. అలయ ఎఫ్ నాలుగేళ్ల క్రితం జవానీ జానేమాన్ (2020)తో కెరీర్ ని ప్రారంభించింది. ఇటీవల అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, మానుషి చిల్లర్‌లతో భారీ-బడ్జెట్ యాక్షన్ చిత్రం బడే మియాన్ చోటే మియాన్ (2024)లో కూడా నటించింది.

Read Also:Shikhar Dhawan: గబ్బర్ మళ్లీ ప్రేమలో పడ్డాడు.. ఓ అమ్మాయితో ధావన్ (వీడియో)

Show comments