NTV Telugu Site icon

Ponnam Prabhakar : ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో చెప్పి రావాలి

Ponnam Prabhakar

Ponnam Prabhakar

బీఆర్‌ఎస్‌ నాయకులు మా జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల ఇచ్చారో చెప్పి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 టీఎంసీల కోసం తీసుకున్న ప్రణాళిక అమలు కాలేదని, రెండు టీఎంసీల రాలేదు రెండు వేల కోట్లతో మూడో టిఎంసి అన్నారని, వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయి. కానీ మేము కడితేనె వస్తున్నాయి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఎల్లంపల్లి, మిడ్ మానెరు ప్రాజెక్టు ద్వారా నీళ్లు వెళ్తాయని, ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో చెప్పి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు మమ్ములను పట్టించుకోలేదని, మూడో టిఎంసి ఎవరి లబ్ధి కోసమో చెప్పాలని, యాదవులకు ఉన్న బకాయిలను మేము వచ్చాక మా జిల్లాలో ఇప్పుడు పరిష్కారం చేస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్‌.

Ghmc: మీ వీధిలో కుక్కలు అధికంగా ఉన్నాయా? అయితే ఈ నంబరుకు ఫోన్ చేయండి..
7నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు – పదేళ్ల ప్రభుత్వం పై చర్చకు సిద్ధమా? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. యాదవులకు చెందిన 8500 డీడీలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తెలంగాణ గురించి కేసీఆర్ నిన్న కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం పై ప్రెస్ మీట్ పెట్టీ ఉంటే బాగుండే అని ఆయన అన్నారు. ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను నరకయాతన పెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ చీల్చీ చెండాడుతా అంటే మేము చూస్తూ ఊరుకోమని, ప్రజా బడ్జెట్ పై కేసీఆర్ అనుమతి అవసరం లేదన్నారు.

Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..