Site icon NTV Telugu

TS Congress: ఎన్నికల కమిటీలో కనిపించని పొన్నం పేరు.. అధిష్టానంపై అసంతృప్తి..!

Ponnam

Ponnam

తెలంగాణ రాజకీయల్లో ఇప్పుడే పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. అందులోనూ హస్తం పార్టీలో అయితే.. ఎన్నికలు ఓ ఆరు నెలల ముందే వచ్చినంత హడావిడి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ లక్ష్యంతో ఉంది. అందుకు సంబంధించి కాంగ్రెస్‌.. మొన్ననే ఎన్నికల కమిటీ కూడా వేసింది. అయితే అందులో కీలక నేతలంతా ఉండగా.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు లేదు. దీంతో అధిష్ఠానంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Jabardasth Varsha: అతడు లేకపోతే చచ్చిపోదాం అనుకున్నా..

ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ పేరు లేదు. దీంతో.. పొన్నం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీలో తన గొంతున గట్టిగా వినిపిస్తూ బలమైన నేతగా పేరు తెచ్చుకున్న పొన్నంకు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా తనకు ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలోనైనా.. తనకు ప్రాధాన్యం లభిస్తుందని ఆశించినా అక్కడ కూడా మొండిచెయ్యే చూపించటంతో.. పొన్నం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధిష్ఠానాన్ని కలిసి తాడో పేడో తేల్చుకొనేందుకు ఆదివారం పొన్నం వర్గీయులు గాంధీభవన్ కి వెళ్లారు. పార్టీ పదవుల్లో పొన్నం ప్రభాకర్ కు అవకాశం ఇవ్వకపోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. పార్టీలో పొన్నంకు ప్రాధాన్యత లభించడం లేదని, ఏ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదని ప్రభాకర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒకటి..రెండు రోజుల్లో పొన్నం ప్రభాకర్ వ్యవహారం సెటిల్ చేస్తామని ఆందోళన చేసిన నేతలకు థాక్రే చెప్పారు.

TS Congress: ఎన్నికల కమిటీలో కనిపించని పొన్నం పేరు.. అధిష్టానంపై అసంతృప్తి..!

మరోవైపు .. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి మాణిక్‌రావ్ థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీ.హనుమంతరావుతో పాటు వ్యూహకర్త సునీల్ కనుగోలు హాజరయ్యారు. త్వరలో జరగనున్న ప్రియాంక గాంధీ సభ, బీసీ డిక్లరేషన్ , పార్టీ కమిటీలపై నేతలు చర్చిస్తున్నారు.

Exit mobile version