NTV Telugu Site icon

Ponnam Prabhakar : మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో సగం కంటే ఎక్కువే..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

నాంపల్లిలోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత – లింగ సమానత్వం పై ఆల్ ఇండియా లెవెల్ ఎడ్యుకేషన్ సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో సగం కంటే ఎక్కువే అని, వృత్తి ,ఉద్యోగ ,వ్యాపార రీత్యా ,గృహ హింస అనేక సందర్భాల్లో మహిళల పై జరుగుతున్న దాని పై అందరూ ఖందించాల్సిందే అన్నారు పొన్నం ప్రభాకర్‌. తల్లిదండ్రులతో సమానంగా గౌరవింపబడే వారు ఆచార్య దేవో భవ అని, స్పేస్, స్పోర్ట్స్ ఏ వృత్తి రీత్యా అయినా, రాజకీయాల్లో అయినా మహిళలు అన్ని రంగాల్లో రానిస్తున్నారని ఆయన అన్నారు. ఇంకా అనేక హక్కుల్లో మహిళలకు న్యాయం జరగాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్‌. 265 రోజుల్లో 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, మహిళలు ఎవరు పని లేకుండా బస్సులో తిరగరన్నారు పొన్నం ప్రభాకర్‌. కానీ మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారని, మహిళలను బస్సులో డ్యాన్స్‌లు చేసుకోమంటున్నారు.. మనం ప్రతిగటీస్తే దిగి వచ్చారని ఆయన తెలిపారు.

Lovers Suicide: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకని బయల్దేరి ప్రేమజంట ఆత్మహత్య..

అంతేకాకుండా..’స్త్రీ శక్తి పేరు మీద ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం.. సమాజంలో మహిళలు మీ శాతాన్ని మరింత పెంచి ముందుకు పోవాలి.. మహిళా ఉపాధ్యాయిని సావిత్రి భాయ్ పూలే ను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి.. కుటుంబం బాగు పడింది అంటే ఆ ఇంట్లో మహిళ తల్లి శ్రమ ఉంటేనే జరుగుతుంది.. భవిష్యత్ సమాజానికి రాబోయే యువతరానికి కార్యక్రమం ఉపయోగకరంగా ఉండాలి.. మహిళలు సాధికారత ,మహిళల స్వేచ్ఛ హక్కులు ,మహిళలు మరింత ఎదగడానికి ఎలాంటి సూచనలు చేయాలనుకున్న మా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నాను.. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చాను.. ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ఎలాంటి లీగల్ ఇబ్బందులు లేకుండా చేశాం.. 19 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చాం. 25 వేల స్కూల్ లకు 1100 కోట్ల తో మౌలిక వసతులు కల్పించాం.. స్కూల్ లలో ఉచిత విద్యుత్,డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నాం.. శానిటేషన్ సిబ్బంది పెట్టుకోవటానికి నిధులు మంజూరు చేస్తున్నాం.. సంక్షేమ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం.. గురుకుల పాఠశాల నూతన భవనాల కోసం 5 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. మహిళా సంఘాల ద్వారా పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..’ అని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Lovers Suicide: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకని బయల్దేరి ప్రేమజంట ఆత్మహత్య..