Site icon NTV Telugu

Ponnam Prabhakar : భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Ponnam

Ponnam

Ponnam Prabhakar : హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈదురు గాలులు భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షపాతం ప్రభావం జీహెచ్ ఎంసీ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఎమర్జెన్సీ టీమ్స్ డిఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగించాలని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో చార్మినార్ బహుదూర్ పుర, నాంపల్లి , అంబర్పేట్ , ఖైరతాబాద్ , ఎల్బీనగర్ ,కూకట్పల్లి ,సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షపాత ప్రభావం ఉందని వెల్లడించారు.

వర్షానికి నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు వెంట వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు. వచ్చే మూడు గంటల్లో నగరంలో మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. డ్రైనేజీ పొంగిపొర్లకుండా hmwssb జెట్టింగ్ మిషన్స్ ద్వారా అరికడుతున్నాయి. పోలీస్ , జీహెచ్ఎంసీ , వాటర్ బోర్డు ,విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకొని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

Google: గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం.. లక్షలాది స్మార్ట్‌ఫోన్‌లపై ప్రభావం!

Exit mobile version