Site icon NTV Telugu

Ponnam Prabhakar : వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా చూడాలి

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar : తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణా శాఖ కు సంబంధించిన లారీలు ఇతర వాహనాలు ఇబ్బంది లేకుండా స్థానిక జిల్లా రవాణా అధికారులు & కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా రవాణా శాఖ తీసుకుంటున్న చర్యల పై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్లు స్థానిక రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

Patnam Narender Reddy: వికారాబాద్ డీటీసీ నుంచి పరిగికి పట్నం నరేందర్ రెడ్డి తరలింపు..

Exit mobile version