Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ వేరే వాళ్ళకి కేటాయించిందన్నారు.. ఏఐసీసీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్, వివేక్, తాను వారి ఇంటికి వచ్చి మాట్లాడినట్లు తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అన్నారు.. రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారని గుర్తు చేశారు.. కరోనా సమయంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ఆయన కూడా కరోనా బారిన పడ్డారన్నారు.. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు.. వారి హయాంలో నగరంలో పార్టీ మరింత అభివృద్ధి చెందేలా ముందుకు పోతున్నామని తెలిపారు.. ప్రస్తుత
పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు..
READ MORE: Vemulawada Temple: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాసిరకం లడ్డూలు..
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. “ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు.. జూబ్లీహిల్స్ ఎన్నిక అంజన్ కుమార్ సారధ్యంలో జరుగుతుంది.. ఆయన నేతృత్వంలో ముందుకు పోతున్నాం.. ఏఐసీసీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్ తో మాట్లాడారు.. కంటోన్మెంట్ ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నీ గెలిపిస్తారు.. అంజన్ కుమార్ యాదవ్ ముందుండి ఎన్నికల్లో ఈ కార్యక్రమాలు తీసుకుంటారు. మా పార్టీ నియంతృత్వం కాదు.. బయటికి స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది.. అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు.. రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయడమే మా నాడు లక్ష్యం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరం కలిసి పని చేస్తాం.” అని మంత్రి వ్యాఖ్యానించారు.