Ponnam Prabhakar : మానేర్ రివర్ ఫ్రంట్ పనులు త్వరగతిన పూర్తి చేస్తాం
- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం
- ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
- కరీంనగర్ స్మార్ట్ సిటీ.. సీఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్.. వాటర్ సప్లై.. సాలిడ్ వాటర్ మేనేజ్మెంట్ తదితర విషయాల సమీక్షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , కలెక్టర్ పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, సీఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్, వాటర్ సప్లై, సాలిడ్ వాటర్ మేనేజ్మెంట్ తదితర విషయాల సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై రివ్యూ జరిగిందన్నారు. ఎనభై పనులలో వర్క్స్ లిస్డ్ లేకుండా పనులు చేసారని, స్మార్ట్ సిటి లో అనేక కాంపోనెంట్ లు ఉన్నాయన్నారు. వైఫై హాట్ స్పాట్ కొందరే వాడుకుంటున్నారని, 98 కొట్ల నిధులపై ప్రగతి లేదన్నారు పొన్నం ప్రభాకర్. భూకబ్జా దారులు ఉంటే చర్యలు ఉంటాయని చెప్పాం.మేము కుడా ఎక్కడ జోక్యం చేసుకోలేదని, గత పదేండ్లలలొ అధికార దుర్వినియోగం చేసి ల్యాండ్ ఖబ్జాలు చేసిన వారి లిస్ట్ సేకరిస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్.
అంతేకాకుండా..’ అనుమతులు లేకుండా అవినీతికి పాల్పడినారు.. వీటిపై విచారణ చేయమని అదేశించాం. వారానికి ఒక డిపార్ట్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించాలని కలెక్టర్ ని కొరడం జరిగింది. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులని త్వరలోనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. త్రాగునీటి సమస్యలపై దృష్టి సారిస్తాం. భవిష్యత్తులో మహిళ శక్తిని బలోపేతం చేస్తాం. మానేర్ రివర్ ఫ్రంట్ పనులు త్వరగతిన పూర్తి చేస్తాం. టూరిజం ప్రాజెక్టు ద్వారా మానేరు రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తాం. స్మార్ట్ సిటి పేరుతో అనధికారికంగా ఎక్కువ ఖర్చు చేసారు. స్మార్ట్ సిటి పనులు,నిధుల వినియోగం పై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రజలుకి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒక విశ్వాసం కలుగజేస్తాం. నగరంలో ఎక్కడైనా తప్పు జరుగుతుందని తెలిస్తే మా దృష్టి కి తీసుకురండి. తప్పు జరుగుతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యా్ఖ్యానించారు.
Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!