NTV Telugu Site icon

Ponnam Prabhakar : మానేర్ రివర్ ఫ్రంట్ పనులు త్వరగతిన పూర్తి చేస్తాం

Ponnam Prabhakar

Ponnam Prabhakar

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , కలెక్టర్ పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, సీఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్, వాటర్ సప్లై, సాలిడ్ వాటర్ మేనేజ్మెంట్ తదితర విషయాల సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం‌ ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై రివ్యూ జరిగిందన్నారు. ఎనభై పనులలో వర్క్స్ లిస్డ్ లేకుండా పనులు చేసారని, స్మార్ట్ సిటి లో అనేక కాంపోనెంట్ లు ఉన్నాయన్నారు. వైఫై హాట్ స్పాట్ కొందరే వాడుకుంటున్నారని, 98 కొట్ల నిధులపై ప్రగతి లేదన్నారు పొన్నం ప్రభాకర్‌. భూకబ్జా దారులు ఉంటే చర్యలు ఉంటాయని చెప్పాం.మేము‌ కుడా ఎక్కడ జోక్యం చేసుకోలేదని, గత పదేండ్లలలొ అధికార దుర్వినియోగం చేసి ల్యాండ్ ఖబ్జాలు చేసిన వారి లిస్ట్ సేకరిస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్‌.

అంతేకాకుండా..’ అనుమతులు లేకుండా అవినీతికి పాల్పడినారు.. వీటిపై విచారణ చేయమని‌ అదేశించాం. వారానికి‌ ఒక‌ డిపార్ట్మెంట్ పై‌ సమీక్ష సమావేశం నిర్వహించాలని కలెక్టర్ ని కొరడం జరిగింది. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులని త్వరలోనే చెల్లించే విధంగా‌ చర్యలు తీసుకుంటాం. త్రాగునీటి సమస్యలపై‌ దృష్టి సారిస్తాం. భవిష్యత్తులో మహిళ శక్తిని బలోపేతం చేస్తాం. మానేర్ రివర్ ఫ్రంట్ పనులు త్వరగతిన పూర్తి చేస్తాం. టూరిజం ప్రాజెక్టు ద్వారా మానేరు రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తాం. స్మార్ట్ సిటి పేరుతో అనధికారికంగా ఎక్కువ ఖర్చు చేసారు. స్మార్ట్ సిటి పనులు,నిధుల వినియోగం పై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రజలుకి‌ కాంగ్రెస్ ప్రభుత్వం పై‌ ఒక విశ్వాసం కలుగజేస్తాం. నగరంలో‌ ఎక్కడైనా తప్పు ‌జరుగుతుందని తెలిస్తే మా దృష్టి కి తీసుకురండి. తప్పు జరుగుతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యా్ఖ్యానించారు.