Site icon NTV Telugu

Ponnam Prabhakar: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి పొన్నం ప్రభాకర్.. సిద్ధమా..?

Ponnamprabhakar

Ponnamprabhakar

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్‌గూడలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రకాష్‌ భాకర్.. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు అని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసినవారిని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధి సాధించినట్లే, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

READ MORE: Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడ్డ భారీ తుఫాన్.. 241 మంది మృతి

బీఆర్‌ఎస్ పాలనలో పెన్షన్లు ఇవ్వడమే అభివృద్ధి కాదని, నిజమైన అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మార్పులు తీసుకురావడమేనని మంత్రి పొన్నం ప్రభావకర్ స్పష్టం చేశారు. తాము కేవలం రెండు నెలల్లోనే 2,500 కోట్ల రూపాయల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి చేశామని తెలిపారు. దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పడు ఈ ప్రాంతానికి పెద్దగా అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సమస్యలను సమర్థంగా ప్రస్తావించలేకపోయారని విమర్శించారు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్‌కు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ గూఢ ఒప్పందం చేసుకున్నాయనే ఆరోపణలు చేస్తూ.. “పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కిషన్ రెడ్డికి సహకరించింది. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గురుదక్షిణగా బీజేపీ అభ్యర్థిని బీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టారు,” అని వ్యాఖ్యానించారు.

READ MORE: ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్‌, లెవల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ తో వచ్చేస్తున్న లెజెండ్ Tata Sierra SUV..!

కేంద్ర మంత్రి కిషన్‌కి మరోసారి సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్..”పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కిషన్ రెడ్డికి సహకరించింది.. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గురుదక్షిణగా బీజేపీ అభ్యర్థిని బీఆర్ఎస్ కు తాకట్టు పెట్టాడు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25వేల ఓట్లు.. ఇప్పుడు కూడా ఈ ఉప ఎన్నికలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే మీరేం చెబితే దానికి నేను సిద్ధం.. 25 వేల ఓట్లు బిజెపి అభ్యర్థికి రాకపోతే నేనేం చెప్తే దానికి కిషన్ రెడ్డి సిద్ధమా.. ఈ ఉప ఎన్నికలో పదివేలలోపే బీజేపీకి ఓట్లు వస్తాయని నేను చెబుతున్నాను. మీ ప్రచారం సరళి చూసిన ప్రజలు మీ సొంత ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బీఆర్ఎస్ కి మీరు లొంగిపోయారని అంటున్నారు.. బీజేపీ, బీఆర్ఎస్ లో మీ ఓటు ఎటు వేసిన సరే అనే ప్రవర్తన కనిపిస్తుందని ప్రజలే అంటున్నారు.. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు.. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు.. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా మీ పార్లమెంట్ పరిధిలోకే వస్తది.. మరి నా ఛాలెంజ్ కు కిషన్ రెడ్డి సిద్ధమా..?” అని సవాల్ విసిరారు.

Exit mobile version