రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జెడ్పీటీసీ, మాజీ జడ్పీటిసి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సహా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంత మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్ట్ ల పేరిట నిర్బంధించారు, కాని మా ప్రభుత్వం స్వేచ్ఛ గా సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. కేటీఆర్ ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను ప్రభుత్వంతో మాట్లాడి, తొలగింప చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ అసమర్థత వల్లనే తొమ్మిదవ ప్యాకేజీ పనులు నిలిచి పోయాయని ఆయన మండిపడ్డారు.
Viral Video : చికెన్ టిక్కా మసాలా కప్‌కేక్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? వీడియో వైరల్..
అయితే.. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నేరుగా ఎమ్మెల్యే అయి, కేసీఆర్ పుత్రునిగా మంత్రిగా అయినావు. మంత్రి పదవి పోగానే మనసన పడతలేదంటూ ఆయన కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తప్ప దేశానికి, రాష్ట్రానికి ప్రజాస్వామ్య బద్దంగా పాలించే పార్టీ లేదని, గతంలో ప్రజా సమస్యలపై ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు మంత్రిగా వచ్చాననన్నారు. ముఖ్యమంత్రి నుంచి అప్పర్ మానేరు అభివృద్ధి పనుల విషయంపై హామీ తీసుకున్నామన్నారు పొన్నం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవెరుస్తామమని చెప్పారు. రాష్ట్రంను అప్పుల కుప్పగా మార్చారని.. అఖిరికి కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ కరెంట్ బిల్లులు కట్టలేదని.. చేనేత బిల్లులు కూడా చెల్లించలేదని విమర్శించారు.దేశానికైనా.. రాష్ట్రానికైనా కాంగ్రెస్ ప్రభుత్వామే ఎప్పటికి రక్ష అని తెలిపారు. సిరిసిల్ల ప్రాంతంలోని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పర్ మనేరు ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
Prashanth Varma: రాముడిగా మహేష్– హనుమంతుడిగా చిరంజీవి.. ప్రశాంత్ వర్మ ప్లానింగ్ వేరే లెవల్
