NTV Telugu Site icon

Ponnam Prabhakar : రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి

Ponnam Prabhakar

Ponnam Prabhakar

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి,పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండని, రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని, ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. మీ ప్రాంతంలో ఎక్కడ అర్టిఏ ద్వారా తీసుకున్న పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వారసత్వపు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నయో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా ఏ పార్టీ వారైనా సమాచారాన్ని ప్రభుత్వానికి పిర్యాదు చేయండని, ముఖ్యంగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్ ,రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరానికి చెరువులను కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలో స్వచ్చందంగా మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ముందుకు రావాలన్నారు పొన్నం ప్రభాకర్‌. ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా ,వ్యక్తిగతంగా ఉద్దేశ్య పూర్వకంగా వ్యక్తుల మీద పార్టీల మీద జరుగుతున్న పోరాటం కాదని, ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.

Satyabhama: వరంగల్‌లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు

అంతేకాకుండా..’తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన లో తీసుకున్న చర్య.. ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురయ్యేయో అక్కడ సమాచారం ఇవ్వాలి.. నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్..! వారానికి నాలుగు సార్లు వెళ్లి ఎంజాయ్ చేయడానికి నీకు జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది.. 111 జీవో కు వ్యతిరేకంగా నిర్మించిన నీవు.. ఆ ఫామ్ హౌస్ ను బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తున్నావ్. నీలాగా నాకు అలా విలాసవంతమైన ఫామ్ హౌస్ లు లేవు కేటీఆర్. నేను ప్రజల్లో ఉండేటోన్ని.. అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తాను.. మాకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్న మాట వాస్తవం.. అక్కడ వాచ్ మెన్ కుటుంబం ఉండడం కోసం పాతబడిన చిన్న నిర్మాణం నిర్మాణం తప్పా.. ఫామ్ హౌస్ లేదు. అయినా ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో వ్యవసాయం, తోటల పెంపకం చేయొచ్చు అనే కనీస అవగాహన నీకు లేనట్లుంది.. కానీ నాకు ఫామ్ హౌస్ ఉన్నట్లు.. అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నట్లు కేటీఆర్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించడం సిగ్గుచేటు. నాకు ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో.. ఎంత విలాసంగా నిర్మించుకున్నానో కేటీఆరే చూపించాలి. అబద్దాలు, చిల్లర మాటలు మాట్లాడడం ఇకనైనా మానుకో కేటీఆర్..!’ అని పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.

Satyabhama: వరంగల్‌లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు