Site icon NTV Telugu

Ponnam Prabhakar : కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా బేడీలు వేసి తీసుకువస్తాం

Ponnam

Ponnam

కేటీఆర్ మల్కాజిగిరి ఎంపీ పదవి పై నిన్న సవాల్ విసరడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం. నీకు నచ్చిన వ్యక్తి పేరు చెబితే రాజీనామా చేస్తారన్నారు. రాష్ట్రంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, భవిష్యత్తులో శిక్ష తప్పదని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కేటీఆర్ అలా మాట్లాడుతున్నట్లు ఉన్నారన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా బేడీలు వేసి తీసుకు వస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి అవసరం లేదు కేటీఆర్… కరీంనగర్ చాలు అని, నాడు జైకా ద్వారా 4600కోట్ల రుణం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్నారన్నారు.

 

దీనిలా కాళేశ్వరం ఎందుకు నిర్మాణం చేపట్టలేదు? అని పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. కేసీఆర్ మానస పుత్రిక ఇప్పుడు బొందలగడ్డ అని, తెలంగాణ వ్యతిరేకి గవర్నర్ నరసింహన్ హరిశ్ రావు కాళేశ్వరరావు అయ్యాడన్నారు. ఏం పీకడానికి పోయారు కాళేశ్వరం? అంటూ పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. అమ్మల పుట్టుక గురించి మాట్లాడుతున్నారు కొంతమంది ఎంపీలు అని, ఇంటి యజమాని ఇల్లు కూలీ పోవాలని కోరుకోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఓ వైట్ ఎలిఫెంట్. దాని భారాన్ని ఎవరు మోస్తారు? అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా పాదయాత్ర చేసినా ఎవరు అడ్డుకోరు. పోలీసులు రక్షణ కల్పిస్తారని, కాదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందన్నారు పొన్నం ప్రభాకర్‌.

 

Exit mobile version