Site icon NTV Telugu

Ponnam Prabhaker: తనకు పాలన అనుభవం లేదు.. కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్

Ponnam Prabhaker

Ponnam Prabhaker

Ponnam Prabhaker: కేటీఆర్ కు పాలనానుభవం లేక అవాకులు పేలుతున్నాడని రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవకముందే పథకాలు అమలవ్వడం లేదని కేటీఆర్ మాట్లాడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. పార్లమెంట్ పై దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని తెలిపారు. దానిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ప్రారంభమైందే ఇప్పుడు క్రమంగా హామీల అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఎవరు పలికిస్తున్నారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. ప్రతీ పథకం అమలుపై 15 రోజులకోసారి సమీక్ష చేస్తామని తెలిపారు.

మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు అంత తొందర పాటు వద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందన్నారు. అయితే.. తాము ఇస్తా అన్న దానికి బీఆర్ఎస్ వాళ్ళు పెంచి చెప్పారు కదా అని ప్రశ్నించారు. కాగా.. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీని అమలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు.

Read also: Alla Ramakrishna Suspension: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేరుతో ఫేక్‌ లెటర్లు.. వైసీపీ ఆగ్రహం

అయితే.. నిన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామన్నారు. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని తెలిపారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారని అన్నారు. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడని వ్యంగాస్త్రం వేశారు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడని తెలిపారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నయి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అంటూ కేటీఆర్ చిట్ చాట్ ద్వారా తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ? అని ప్రశ్నించారు కేటీఆర్.
Nityanand Rai : చనిపోయిన 3351మంది సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ సైనికులు

Exit mobile version