NTV Telugu Site icon

Ponnam Prabhakar: జ్యోతిషం చెప్పినట్లు ఉంది.. బండి‌ సంజయ్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్..

Ponnamprabhakar

Ponnamprabhakar

Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బండి‌ సంజయ్ మాట్లాడిన‌ మాటలు జ్యోతిషం చెప్పినట్లుగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఅర్ఎస్ ఒక్కటే అంటే నమ్మలేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతుందని మాట్లడడం నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఅర్ఎస్ కి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరన్నారు. జగథ్గురు చెప్పినగాని అశాస్త్రీయంగా అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారని, ఇది ఎన్నికల స్టంటే అన్నారు. లింగ ప్రాణప్రతిష్ఠ ఎవ్వరూ చేయాలో తెలియదా? ఇది అరిష్టం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యం చెందిన ఎంపీలలో బండి‌సంజయ్ నంబర్ వన్ అన్నారు. మాజీ ఎంపి వినోద్ కుమార్ కరీంనగర్ కి ఏం చేసాడో చెప్పాలని ప్రశ్నించారు. దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించండి అన్నారు. కేసీఆర్, వినోద్ కుమార్, కేసీఆర్ లు ఎంపిలుగా ఏం అభివృద్ధి చేసారో, నేను ఎంపిగా ఏం చేసానో చర్చకి వస్తారా? అని సవాల్ విసిరారు. రాముడి కటౌట్లు పెట్టుకుని బీజేపి ఓట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన అసహనం తో ఉన్నారని అన్నారు. సీఎం పదవి కన్నా కేసీఆర్ పవర్ పుల్ అనేది భ్రమ అన్నారు.

Read also: Avanthika: మహేష్ పక్కన నటించిన ఈ అమ్మాయి… 18 ఏళ్లకే హాలీవుడ్ లో దుమ్ములేపుతోంది

కేసీఆర్ పదానికి పూజ చేసుకోండి అంటూ తెలిపారు. సీఎం పదవి ఎడమ కాలు చెప్పుతో సమానం అని తండ్రి అంటే కొడుకు సీఎం పదం కంటే కేసీఆర్ పదం పవర్ అంటాడు అని గుర్తు చేశారు. జీవితంలో ఎప్పుడూ కూడ బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేయవని స్పష్టం చేశారు. అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు మరోసారి జిల్లాల, నియోజకవర్గాల మండలాల పునర్విభజన జరగాలన్నారు. పునర్విభజనపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది…కమిటీ వేయనుందన్నారు. దేశం కోసం ఎవరు ఏం చేశారో తెలుసన్నారు. దేశ సంపద కాంగ్రెస్ సృష్టిస్తే, సంస్థలు ఏర్పాటు చేస్తే బిజేపి అమ్ముతుందన్నారు. పెళ్ళాం పుస్తెలు అమ్మిన ఎన్నికల్లో కొట్లాడిన అన్న వ్యక్తి బండి సంజయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశావన్నారు. పెద్దపెద్ద కటౌట్లు ప్లెక్సీలు పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడివి? అని ప్రశ్నించారు. ఆర్టీసీని గత ప్రభుత్వం చంపేసిందన్నారు. త్వరలోనే ఆర్టీసి ప్రయాణీకుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు ఫిర్యాదు చేయండి చర్యలు చేపడుతామని క్లారిటీ ఇచ్చారు.
Avanthika: మహేష్ పక్కన నటించిన ఈ అమ్మాయి… 18 ఏళ్లకే హాలీవుడ్ లో దుమ్ములేపుతోంది