NTV Telugu Site icon

Ponnam Prabhakar : రైతన్నలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు

Ponnam Prabhakar

Ponnam Prabhakar

లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో మరపురాని ఘట్టమన్నారు.

AP Home Minister: ఏపీలో పోలీసులకు వీక్ ఆఫ్లు.. కొనసాగుతున్న సన్నాహాలు..?

రాహుల్ గాంధీ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. రైతన్నలంత ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీ ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతన్నలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్