Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar – Pawan Kalyan: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే హైదరాబాద్‌లో నవనిర్మాణ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గతంలో మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని బహిరంగంగా చెప్పారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణపై విషం కక్కుతూ, తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఇక్కడ సభ నిర్వహించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అదే రోజున హైదరాబాద్‌లో నవనిర్మాణ సభ నిర్వహించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతోందని, ఇందులో బీజేపీతో పవన్ కళ్యాణ్‌కు లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శించారు.
Also Read
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! 'క్లబ్‌లోకి స్వాగతం' అంటూ..
- RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
తెలంగాణ ప్రజలపై గతంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి సభలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. “తెలంగాణ కళ్ల దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని చెప్పిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి” అని వ్యాఖ్యానించారు. అలాగే నవనిర్మాణ సభను గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు లేదా కేరళలో కాకుండా హైదరాబాద్‌లోనే ఎందుకు నిర్వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నాయకత్వాన్ని మెప్పించడానికే తెలంగాణలో సభలు పెడుతున్నారా అని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని, అక్కడి సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై పోరాడకుండా తెలంగాణలో రాజకీయాలు చేయడం సరైన విధానం కాదన్నారు. తెలంగాణపై వ్యతిరేక భావజాలంతో వ్యవహరించిన పవన్ కళ్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
-
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!