Ponnam Prabhakar: ఎవరు.. ఎంతో వారికి అంత అని రాహుల్ గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగా కుల గణన సర్వే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు.. బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ ఒక్కటే అని, సర్వే లో పాల్గొనని వాళ్ళు… ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వే కి వెళ్ళిన వాళ్లకు రెస్పాండ్ కాకుండా… ఇప్పుడు సర్వే రాలేదు అంటున్నారని, ప్రధాన రాజకీయ పార్టీ నేతలు సర్వేలో పాల్గొనలేదని ఆయన పేర్కొన్నారు. బీసీలకు చాలా ఏండ్ల తర్వాత మేలు జరగబోతుందని, అడ్డుకోవాలని చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.
Bunny Vasu: పవన్ కళ్యాణ్ ఒకసారి పక్కన పెడితే కష్టం.. బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!
అంతేకాకుండా.. ఇన్నాళ్లు ఉద్యమం చేసిన పోరాట యోధులకు అభినందనలు తెలిపారు మంత్రి పొన్నం. ప్రభుత్వ ఆలోచన చివరి వరకు అందే వరకు అదే స్ఫూర్తి కొనసాగాలని, రేపు కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్. బీసీ సామాజిక వర్గాలు ముందుకు రావాలి అని కోరుతున్నాని, రాహుల్ గాంధీ… సీఎం రేవంత్ కి ధన్యవాదాలు తెలిపారు. 3.1 శాతం సర్వే లో పాల్గొనలేదని, సర్వే కి వెళ్ళిన అధికారుల మీద దాడులు చేసిన సంఘటనలు కూడా చూశామన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకకండని, కవిత కుటుంబంలో మిగిలిన కుటుంబ సభ్యులు వివరాలే ఇవ్వలేదన్నారు.
ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురావాలన్నారు. మీ పెద్దలు సర్వేలో ఎందుకో పాల్గొనలేదు.. చెప్పండి.. సర్వే 32 మంది కలెక్టర్ లు.. లక్ష మంది సిబ్బందితో చేసింది.. రేపటి అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ రావాలి.. బీసీలకు మేలు చేయాలి అనుకుంటే రావాలి అని ఆయన వ్యాఖ్యానించారు.
Samantha : బాలీవుడ్ హీరోతో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్