NTV Telugu Site icon

Ponnam Prabhakar : విద్యారంగ సమస్యలకు 5,000 కోట్ల కేటాయించాం

Ponnam

Ponnam

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకుల హాస్టల్లలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రతి జిల్లా కలెక్టరు, శాననసభ్యులు, విద్యశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించామన్నారు పొన్నం ప్రభాకర్‌. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనులను పూర్తిచేయాలని ఆదేశించామని, పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామన్నారు పొన్నం ప్రభాకర్‌.

Online Betting: రెండు ప్రాణాలు తీసిన బెట్టింగ్‌.. కొడుకు కోట్లలో అప్పు.. తల్లిదండ్రుల ఆత్మహత్య..

విద్యారంగ సమస్యలకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించామని, అసౌకర్యాలతో ఉన్న అన్ని విద్యాసంస్థలకు స్థలాల కేటాయింపు జరిపి పక్క భవనల నిర్మాణం చేపడతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. అంతేకాకుండా.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 42 రైతు వేదికల ద్వారా యువ రైతులకు విజ్ఞప్తి చేస్తు్న్నానన్నారు. యువరైతులకు వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తరపున అవసరమైన రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నానని, హుస్నాబాద్ లో యువరైతులకు వ్యవసాయ ఆధారిత పథకాలకు అవసరమైన రుణాలు ఇప్పించేందుకు నేను, యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు పొన్నం ప్రభాకర్‌.

Best Wife – Best Husband: ఉత్తమ భార్యగా శ్రీవాణి.. ఉత్తమ భర్తగా దివ్వెల మహేష్!

Show comments