NTV Telugu Site icon

Ponnam Prabhakar : మూసీ పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు కూల్చలేదు

Ponnam Prabhakar

Ponnam Prabhakar

హైడ్రా వేరు, మూసీ కార్యక్రమం వేరని, హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఇవాళ సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ నది సంరక్షణ కోసం ఇప్పుడు మూసీ కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి పొన్నం. మూసీ పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు కూల్చలేదని, బాధితులు ఒప్పుకుంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి ఖాళీ చేపిస్తున్నామని ఆయన తెలిపారు.

Nimmala ramanaidu: టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది..

అంతేకాకుండా.. మార్కింగ్ వేసిన ఏ ఇండ్లను కూల్చలేదని, కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో BRS పార్టీ దుష్ప్రచారం చేయిస్తోందని ఆయన మండిపడ్డారు. 30 మెడికిల్ కాలేజీలు కట్టే బదులు 30 వాట్సాప్ గ్రూపులు ఉంటే చాలన్న కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారని, మల్లన్నసాగర్, గౌరవేల్లి ప్రాజెక్టు బాధితులపై BRS పార్టీలాఠీ ఛార్జ్ చేయించినట్లు మేము చేయడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. మూసీ నిర్వాసితుల జీవితాలతో BRS నాయకులు ఆడుకోవాలని చూస్తున్నారని, అధికారం లేదని ప్రజలను రెచ్చగొట్టే విదంగా BRS నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.

Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..