NTV Telugu Site icon

Ponguleti: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు రెండు ఒక్కటే..

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు రెండు ఒక్కటే అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా 32 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా పని చేసి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఎన్నికలు రాగానే ఆయన గురిగింజను అంటున్నారని మండిపడ్డారు. ఆయన ఏ సామాజిక వర్గం దగ్గరకు వెళ్తే ఆ సామాజిక వర్గం వాడిగా చెప్పుకునే మనస్థత్వం ఆయనదన్నారు. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖమ్మంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. తుమ్మల వారిపై వీరిపై కేసులు పెట్టమని ఏ రోజు అధికారులను ఆదేశించలేదని గుర్తు చేశారు. అరాచక పాలన నడిపే వ్యక్తి కావాలా? అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా? అని ప్రశ్నించారు. ఇదే జిల్లాకు వచ్చి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అవాక్కులు పేలారని తెలిపారు. అరాచకంగా సంపాదించి డబ్బుతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంటున్నారు, అరాచక అనే నైతిక హక్కు నీకు ఉందా కేసిఆర్? అని ప్రశ్నించారు. అయినా మీ లాగా.. మా కుటుంబంలో ఎవరు రాజకీయంగా డబ్బు సంపాదించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేసే రాజకీయ పార్టీ, వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే కేసీఆర్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుండా కొన్ని మాటలు మాట్లాడావ్.. అది నీ సంస్కారానికి వదిలేస్తున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు ప్రతి విషయం స్పష్టంగా గమనిస్తున్నారని అన్నారు. ఏదో నేను అసెంబ్లీ గేట్ తాకనివ్వను అంటున్నావ్, నేనే కాదు ప్రజలే నిన్ను మీ అభ్యర్థులను గేట్ తాకనివ్వరు అన్నారు. ఏదో గడియారం గురించి మాట్లాడావ్, 70 రూపాయలు ఉంటుందని కానీ అది నేను రాజకీయంగా వాడేందుకు ఉపయోగించడం లేదన్నారు. ప్రశాంతంగా మనం జీవితం గడపాలి అంటే, మన భూములు ఉండాలి అంటే.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. రెండవ వ్యక్తిని గెలిపిస్తే ఖమ్మంలో అరాచకం కొనసాగుతూనే ఉంటుంది, అడ్డు అదుపు లేకుండా పోతుందని అన్నారు. ఖమ్మంలో అత్యధిక మెజారిటీతో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు అవి రెండు ఒక్కటే అని అన్నారు.
Bandi Sanjya: రాహుల్ కి ఛాలెంజ్.. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా..!