Ponguleti Srinivas Reddy : హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క… వరంగల్, మహబూబాబాద్ ఎంపీ లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ..కలెక్టర్లు…కార్పొరేషన్ చైర్మన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది పాలన సమయంలో… ఎన్నికల సమయంలో… ఇచ్చిన మేరకు… అభివృద్ధి… సంక్షేమ పథకాలు రెండు కళ్లలాంటివన్నారు. పేదోడి కలలు నెరవేర్చాలని…ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, 75వ గణతంత్ర వేడుకల సమయంలో… 26జనవరిన అమలు చేయబోతుందన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం 10వేలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా… 12వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు. పంటలకు బోనస్… వ్యవసాయానికి యోగ్యమైన భూములకు రైతు భరోసా.. ప్రభుత్వం కు కావాల్సిన అభివృద్ధి కోసం… రోడ్లు కోసం సేకరించిన భూముల.. కొండలు, గుట్టలు… పుట్టలకు రైతు బంధు ఇచ్చిందన్నారు.
AP CM: ఇంటింటికీ గ్యాస్ పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
అంతేకాకుండా..’తాము ఆలాంటి తప్పులు తాము చేయం. 16నుంచి 26వరకు గ్రామ సభ పెడుతుంది…. అర్హులను ఎంపిక చేస్తుంది… నాలుగు గోడలలో కూర్చొని భూ భారతి తయారు చేయలేదు… అధికారులు గ్రామానికి వస్తారు… ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అందిస్తారు… .అర్హులకు అందివ్వాలానేది ప్రభుత్వ లక్ష్యం… ఎన్ని ఎకరాలు అనేది ముఖ్యo కాదు… అధికారులు మొక్కుబడిగా కాకుండా… రైతులను రాజు చేయాలనే తపన తో పని చేయాలి… గత ప్రభుత్వం పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు… ఈ ప్రభుత్వం లో నిరంతరం జరిగే ప్రక్రియ… గతం లో దరఖాస్తు చేసుకొని పక్షం లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి… ఓకే కార్డు లో ఓకే పేరు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి… ఇందిరమ్మ… ఆత్మీయ భరోసా…భూమి లేని నిరుపేద కు రెండు విడత ల్లో 12వేలు ఇస్తాం… దేశం లో ఎక్కడా లేదు… మొదటి దఫాలో ఇంటి స్థలం కలిగిన వారికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు… శాంతి భద్రతలకు విఘతం కల్పించకుండ… అధికారులు సమన్వయoతో పని చేయాలి… చిన్న చిన్న పొరపాట్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి అధికారులు…’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.