Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy: అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు కర్రు కాసి వాత పెడుతారు..

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడారు అని కాంగ్రెస్ ప్రచాక కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేజారుతుందనే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతుల రుణమాఫీ అంటూ ఎన్నికల కోసమే హడావుడి చేస్తున్నాడు అని ఆయన ఆరోపించారు. తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత మీ హామీలు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉంది అంటూ వ్యాఖ్యనించారు.

Read Also: Rahul Gandhi: 137 రోజుల తర్వాత పార్లమెంటుకు రాహుల్ గాంధీ.. లభించిన ఘనస్వాగతం

తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైస్ రాజశేఖర రెడ్డి అడిగిన వారికల్లా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు.. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. కాళ్లు అరిగేలా తిరిగినా ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఎన్నికల కోసమే.. రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తుంది అని తెలిపారు.

Read Also: Tilak Varma-Samaira: సమైరాకి ప్రామిస్ చేశా.. నా తొలి హాఫ్ సెంచరీ ఆమెకే అంకితం: తిలక్ వర్మ

అధికారం ఉందని బీఆర్ఎస్ నేతలు అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ ప్రచాక కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీసులు చేతిలో ఉన్నారని అర్థరాత్రి కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం మంచిది కాదు.. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు కర్రు కాసి వాత పెట్టడం ఖాయం.. అధికారం అనేది వస్తుంది.. పోతుంది.. డబ్బు కూడా వస్తు.. పోతూ ఉంటుంది.. అధికారం ఉందని విర్రవీగే వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

Exit mobile version