NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : మంత్రి పువ్వాడపై పొంగులేటి వర్గీయుల ఫైర్‌

Ponguleti Srinivas

Ponguleti Srinivas

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు మంత్రి పువ్వాడ అజయ్‌పై ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ.. పొంగులేటి అడగడం వల్లనే జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు…. కానీ ఖమ్మంలో ఇళ్ల నిర్మాణం మాత్రం పొంగులేటి చేస్తారన్నారు. పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం చూసి పువ్వాడకు పూనకం తెప్పించిందని, టెన్షన్ పడుతూ వేదికపై గోర్లు కొరుకుకుంటున్నారన్నారు. కూనవరంలో పువ్వాడ జమీందారు కాదు కదా… ఖమ్మం వచ్చి మీరు ఏంత సంపాదించారో ప్రజలకు తెల్సు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘పొంగులేటి ఆర్థిక నేరాలపై, ఎంక్వరీపై ఇన్నాళ్లు ఏమీ చేశారు… మమత మెడికల్ కాలేజ్ దగ్గర గుడిసెలు బలవంతంగా ఆక్రమించు కోని పేదలను వెళ్లగోట్టారు. మీ అవినీతి అక్రమాల పై మేమే ఎంక్వైరీ వేసి త్వరలో బయట పెడతాం.. నూతన బస్టాండు అవినీతి పై ప్రశ్నించిన సీపీఎం నేతలపై కేసులూ పెట్టారు.

Also Read : Sajjala Ramakrishna Reddy: తల్లి ఆరోగ్యం బాగాలేకపోతే నాటకాలు అంటూ ప్రచారం చేస్తారా?

బీజేపీ పార్టీ సాయి కిరణ్ అనే యువకుడి పై కేసులు పెట్టించి, మృతి కి కారణం అయ్యావు… గొల్లపాడు ఛానల్ పై అవినీతి అక్రమాల చేశారు…. ఖమ్మం, ఇల్లందు ప్రాంతాలలో బైరటిస్ లను అక్రమంగా తరలిస్తున్నారు…. డబుల్ బెడ్ రూం ల విషయంలోఅవినీతి నీ ప్రోత్సహించి, డబ్బులు వసూలు చేసినా నీ అనుచరులు ఎందుకూ అరెస్ట్ చేయలేదు…. పొంగులేటి 1000 కోట్లు రూపాయలు కాంట్రాక్ట్ పనులు రాకుండా అడ్డుకుంటున్నారు…. నీ వాళ్ళే తెరాస ఆఫీస్ లో నీ ఫోటో తీశారు…. మా ఓటమి పక్కన పెట్టు నీ పక్కన కట్టప్పలు వున్నారు… వచ్చే ఎన్నికల్లో మీకు తప్పక బంగ పాటు తప్పదు… బ్యాంక్ రుణాల పై ఆరోపణలు సరైనవి కావు….. బ్యాంక్ లో ఏటువంటి అవినీతి జరగలేదు….. నీకు దమ్ముంటే…అష్ట లక్ష్మీ గుడి వద్దకు రా! ఇద్దరం ప్రమాణం చేద్దాం.’ అని ఆయన అన్నారు.

Chetna Pande : బీచ్ ఒడ్డున అందాల సునామి సృష్టిస్తున్న చేతన పాండే