NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ… ఖజానా మాత్రం ఖాళీ

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

మార్పు కావాలని.. ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అని కాంగ్రెస్ నీ దివించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లు గా పని చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ వచ్చిన వెంటనే ఐదు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ… ఖజానా మాత్రం ఖాళీ అని, మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామన్నారు. రైతుల రుణమాఫీ .. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రీతిలో చేశామని, దుబారా ఖర్చులు దూరం పెట్టీ రైతును రాజు చేసే పనిలో పడ్డామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని, 31 వేల కోట్లు మాఫీ కోసం అవసరం అవుతాయని అంచనాతో సిద్ధం అయ్యామన్నారు. 18 వేల కోట్లు ఇచ్చాము..ఇంకో 12 వేల కోట్లు రైతులకు అందాల్సి ఉందని, బీఆర్‌ఎస్‌ లక్ష రూపాయలు మాఫీ చేయడానికే.. ఐదేళ్లు పట్టిందని, RRRనీ అమ్మకానికి పెట్టింది మీరు.. ఎన్నికలు వస్తేనే మాఫీ డబ్బులు వేసింది మీరు అని ఆయన మండిపడ్డారు.

Tollywood: టాలీవుడ్ టాప్ -10 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..

అంతేకాకుండా..’ ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం లో 30 లక్షల మంది లబ్ధిదారులు ఉండే.. ఇప్పుడు 43 లక్షల కు పెరిగింది. అలాగే.. కొందరు రైతులకు టెక్నికల్ కారణాలతో మాఫీ కాలేదు. వాళ్లకు కూడా మాఫీ అవుతుంది. త్వరలో 2 లక్షల పై బడి రుణం ఉన్న రైతులకు గడువు పెట్టబోతున్నాం. గడువు లోపు బాకి చెల్లించిన తర్వాత 2 లక్షల రుణమాఫీ. గత ప్రభుత్వం మాదిరిగా మాటలు చెప్పం.. ఇంకో వెయ్యి కోట్లు ఐనా మాఫీ చేయడానికి సిద్ధం గా ఉంది ప్రభుత్వం. రెండు లక్షల పై చిలుకు అప్పులు ఉన్న రైతులకు ప్రభుత్వం క్లారిటీ. 2 లక్షల పైబడి ఉన్న అప్పు చెల్లించేందుకు రైతులకు త్వరలోనే గడువు ప్రకటించనున్న సర్కార్. గడువు లోపు చెల్లించిన రైతులకు 2 లక్షల మేర రుణం మాఫీ చేస్తామని పొంగులేటి ప్రకటన.’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

TPCC Chief Post: తెలంగాణ పీసీసీ చీఫ్పై ఢిల్లీలో కసరత్తు..