వికారాబాద్ జిల్లా తాండూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రులు స్పీకర్ గడ్డం ప్రసాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా.. తాండూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణస్వీకారంలో పాల్గొ్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో అవాకులు చివాకులు తేలడం తప్ప ప్రతిపక్ష నాయకులు చేసిందేమీ లేదని, రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి వీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఇద్దరు కేంద్ర మంత్రులున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రానికి 18 లక్షల పైచిలుక ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం రాజశేఖర్ రెడ్డి మంజూరు చేశారన్నారు..
Karti Chidambaram: బంగ్లాదేశ్ ఎఫెక్ట్.. పొరుగు దేశాలపైన ప్రభావం ఉంటుంది
అనంతరం కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 7 నెలలు అయిందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఓర్చుకోలేక పోతుందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలి వారి సూచనలు సలహాలు ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.
Vinod Kambli: మద్యం మత్తులో నడవలేని స్థితిలో టీమిండియా మాజీ ఆటగాడు..