NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : టెక్స్‌టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగపడుతుంది..

Ponguleti

Ponguleti

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానగా ముఖ్యమైన అంశాలు విశ్లేషించుకున్నామని, పరకాలకు సంబంధించిన విషయంపై హైదరాబాదులో మాట్లాడనున్నామన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగ పడుతుందని, టెక్స్ టైల్ పార్క్ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం చేసిందన్నారు మంత్రి పొంగులేటి. గతంలో వరంగల్ కు వచ్చిన ముఖ్యమంత్రి టెక్స్ టైల్ పార్క్ ను ఈ దేశం లో కాదు, ప్రపంచ దేశంలకే రోల్ మోడల్ గా చేయాలని ఉందని, ముఖ్యమంత్రి కొరియా వెళ్లినపుడు… టెక్స్ టైల్ పార్క్ గురించి అనేక విషయాలు మాట్లాడారన్నారు. రానున్న రోజుల్లో టెక్ టైల్ పార్క్ కి పెద్ద కంపెనీలు రావడానికి సుముఖం గా ఉన్నారని, ప్రజలు పక్షపతికి గా ఉండేది ఈ ప్రభుత్వమన్నారు మంత్రి పొంగులేటి. వైఎస్ జల యజ్ఞం లో భాగంగా, కొనేమాకుల రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా ఓపెన్ చేస్తాం, ఆ ప్రాంత ప్రజలు ఉపయోగ పడుతుందని, నెల రోజుల్లో లోప్ నూతన హాస్పిటల్ మొదటి ఫ్లోర్ ప్రారంభించి,పాత హాస్పిటల్ షిఫ్ట్ చేస్తామన్నారు.

Jishnu Dev Varma :దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలి..

అంతేకాకుండా..’ మున్సిపల్ పరిదిలో డ్రెయిన్, లోపం తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. గత ప్రభుత్వం 4 కోట్ల తో మొక్కుబడి గా పనీ చేసింది… పరకాల లో ఎన్ని కొట్లైన డ్రైయిన్ సమస్యలు లేకుండా చేస్తాం… ప్రతి ఇంటి కి కొబ్బరి నీళ్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం చెప్పింది.. మిషన్ భగీరథ బాగోతం బయటపడింది… ప్రజల కు స్వచ్చమైన మంచి నీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం.. మాటల తో కాకుండా,ధనిక రాష్ట్రం అని కాకుండా, అభివృది,సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేస్తున్నాం… ప్రజలు కిచ్చిన రూపాయి నుంచి 2 లక్షలు వరకు రుణ మాఫీ చేసినం.. ఇప్పటి వరకు 19 వేల కోట్లు రైతుల ఖాతా లో జమ అయ్యింది… ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న నాయకులు కొంత మంది నీ రెచ్చగొడుతున్నరు.. రానున్న రోజుల్లో అర్హులైన రైతులకు 12 వేల కోట్ల అందిస్తాం… ఇది ఇందిరమ్మ రాజ్యం… ఎన్నికల ముందు జాబ్ క్యాలెండరు మాట ఇచ్చి నెరవేర్చుకున్నం,అసెంబ్లీ లో విడుదల చేసినం… మాటల తో కాకుండా మౌలిక వసతుల విషయం లో ఈ ప్రభుత్వం సదుపాయాలు అందిస్తుంది.’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Jishnu Dev Varma :దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలి..