Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : ఏడాదిన్నరలోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి

Ponguleti

Ponguleti

ఈ ఏడాది సాగర్ కాల్వల ద్వారా సీతారామ నీళ్ళని ఇస్తామని, పాలేరు వద్ద రిజర్వాయర్లతో గోదావరి జలాలు నింపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మూడు జిల్లాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును ఏడాదన్నరలోపు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రణాళిక లేకుండా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించినప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదని ఒక చుక్క నీరు కూడా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేక పోయిందని పొంగులేటి ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులకు నిరం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి వైరా రిజర్వాయర్ కి సీతారామ నుంచి గోదావరి జిల్లాలు అందించి సాగర్ ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా పాలేరు వద్ద కూడా సొరంగం పూర్తి చేసి ఏడాది న్నర లోపు సీతారామ నుంచి నీళ్లు అందిస్తామని మంత్రి పొంగులే శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version