NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టాం..

Ponguleti

Ponguleti

తెలంగాణా రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఆరు నెలలు ఐయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టమని, ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. యువతను ప్రతిపక్షం రెచ్చగొడుతుందని, పది సంవత్సరాలు పాలించిన BRS ప్రభుత్వం యువతకు ఏం చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని, గత ప్రభుత్వ పెద్దలు పేపర్లు లీక్ చేయించి వారి బంధువులకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులను బలి తీసుకున్నారన్నారు. స్వచ్ఛమైన tspsc ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మెగా డీఎస్సీ ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి.

అంతేకాకుండా..’ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లో ప్రభుత్వం వెనకడుగు వేయదు.. ప్రధాన ప్రతిపక్షం యువతను రెచ్చగొట్టే భాషను మానుకోవాలి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ సాగర్,ఇందిరా సాగర్ 2500 కోట్ల తో మొదలు పెడితే BRS ప్రభుత్వం 19 వేల కోట్లకు రీడిజైన్ చేసింది.. BRS ప్రభుత్వం 8వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు.. ఆనాడు ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దతు ఈ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నాం.. సీతారామ కాలువలను రాబోయే ఒకటిన్నర సంవత్సరం లోపే పూర్తి చేస్తాం.. మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ పూర్తి చేసాం..

 

రెండవ లిఫ్ట్ కూడా త్వరలోనే ట్రయల్ రన్ చేస్తాం.. ఆగస్టు15 వ తారీకున సీతారామ ఫస్ట్ పేజ్ ముఖ్యమంత్రి తో ప్రారంభిస్తం.. లిఫ్ట్ లకు స్టోరేజ్ ట్యాన్క్ లను గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.. అనేక రిజర్వాయర్ లకు నామ మాత్రం గా శంకుస్థాపన చేసి వదిలేశారు.. మున్నేరు నుంచి ప్రతి సంవత్సరం 40 టీఎమ్ సీల నీరు వృధాగా సముద్రం లో కలుస్తుంది.. మున్నేరు నుంచి పాలేరు కు 100 కోట్ల తో లింక్ కెనాల్ ను పూర్తి చేస్తాం.. యుద్ధ ప్రాతిపదికన సీతారామ కెనాల్ పనులు పూర్తి చేయాలి.. రైతులు కూడా సహకరించాలి.. BRS ప్రభుత్వం Srsp కాలువ తీసి రైతులకు నీళ్లు ఇవ్వలేదు.. ఈ ప్రభుత్వం లో Srsp కాలువ ద్వారా చివరి భూముల వరకు నీళ్లిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది..’ అని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.