Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy : తెలంగాణ ప్రభుత్వంలో రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయం

Ponguleti Srinivad Reddy

Ponguleti Srinivad Reddy

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరెంపల గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఎంతయితే ఆనందంతో పాలాభిషేకం చేశారన్నారు. గత ప్రభుత్వములో లాగా పది సంవత్సరాలు రుణమాఫీ ఇచ్చేయకుండా మాయ మాటలు చెప్పి గడిపిన నట్లుగా మా ప్రభుత్వం ఉండదని, ముఖ్యమంత్రి క్యాబినెట్ సమక్షంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయమని, నిబద్ధత గల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ప్రజలు కోరుకునే ప్రభుత్వం మీ ప్రభుత్వమన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

పేదోడి కోసం పని చేసే ప్రభుత్వ మనీ మనసుపూర్తిగా చెబుతున్నామని, ఆ ప్రభుత్వ ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది అని చెబుతున్నామని ఆయన తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి పోయిందని, ఆ కాలేశ్వరం ప్రాజెక్టు నేడు కుంగిపోయింది కొట్టుకపోయిందన్నారు. మీకు ఇచ్చిన ఆమెని నెరవేర్చటం కోసమన్నారు. ఒకపక్క ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు కట్టాల్సి వస్తుందని, మరోపక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సి వస్తుందని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ రెండిటిని సమతుల్యం చేస్తూ మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తుందని చెబుతున్నామన్నారు.

Exit mobile version