ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ తొత్తులు ఇచ్చినవే అని ఎన్టీవీతో మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ పేరిట బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. బీజేపీ సూచనల మేరకే ఎగ్జిట్ పోల్స్ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు అద్బుతమైన మెజారిటీ తో గెలుస్తోందని, బీజేపీ మూడు సీట్లలో మాత్రమే బలం ఉందన్నారు మంత్రి పొంగులేటి. ఐదు సీట్లలో కాంగ్రెస్ కు పోటీ ఉందని, ఈవీఎంలపై ఇండియా కూటమికి అనుమానాలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాతా పార్లమెంటు ఎన్నికల్లో ఓపెన్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఇక రూల్డ్ అవుట్ అని, కేంద్రంలో చక్రం తిప్పుతానన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఖాతా ఓపెన్ కాదని ఆయన అన్నారు. రింగ్ తిప్పుతానన్న కేసీర్ మెదక్ పార్లమెంట్ సీట్లో తమ కుటుంబం పోటీ చేయకుండా తప్పుకుందని, ఆ పార్టీ ప్రజల్లోకి వచ్చేది లేదు కనిపించేది లేదన్నారు.
