NTV Telugu Site icon

POMIS: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా వడ్డీ పొందండి..

Pomis

Pomis

POMIS: చాలామంది ప్రజలు తమ డబ్బును రిస్క్ లేని, మంచి రాబడిని పొందే చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈ విషయంలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లను చాలా మంది ఎంచుకుంటారు. ఎందుకంటే., ఇక్కడ పెట్టిన మొత్తం పెట్టుబడి పరంగా సురక్షితం కాబట్టి. మీరు పోస్ట్ ఆఫీస్ ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఎంపిక చేసుకుంటే ప్రతి నెల ఆధ్యాన్ని పొందవచ్చు. ఇది పోస్టాఫీసు చిన్న పొదుపు పథకం. ఇందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ నెలవారీ ఆదాయం ప్రారంభమవుతుంది. నెలవారీ ఆదాయాన్ని పొందడానికి ఈ పోస్టాఫీసు పథకంలో మీరు ఎలా, ఎంత పెట్టుబడి పెట్టవచ్చో.. దీనిపై మీకు ఎంత వడ్డీ లభిస్తుంది., ఇంకా ఈ పథకం కింద నెలవారీ ఆదాయం ప్రయోజనాన్ని మీరు ఎప్పటి వరకు పొందగలరన్న వివరాలని తెలుసుకుందాం…

GOAT : 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు గట్టి దెబ్బే..

నెలవారీ ఆదాయ పథకం (MIS) అనేది ఒక రకమైన పెన్షన్ పథకం. ఈ స్కీమ్‌లో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా, మీరు రాబోయే 5 సంవత్సరాలలో ప్రతి నెలా హామీతో కూడిన ఆదాయాన్ని పొందుతారు. సింగిల్, జాయింట్ ఖాతాల ద్వారా MISలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టుబడి, అలాగే ఉమ్మడి ఖాతా ద్వారా గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) అనేది మీరు ప్రతి నెలా వడ్డీ పొందే ఒక రకమైన టర్మ్ డిపాజిట్ ఖాతా. మీరు ఇందులో నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసి, ఆపై వడ్డీ ద్వారా ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. దీని పెట్టుబడి కాలం 5 సంవత్సరాలు.

Rescue Operation: బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల బాలిక..

ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4% వార్షిక వడ్డీని ఇస్తున్నారు. అయితే, దాని వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారవచ్చు. ఈ విధంగా, మీరు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)లో రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే, మీరు 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 5,550 చొప్పున నెలవారీ వడ్డీని పొందుతారు. అదే సమయంలో, MISలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే.. మీ నెలవారీ ఆదాయం ప్రతి నెలా ఆదాయం రూ. 9,250 అవుతుంది. ఇక ఈ పథకంపై సంపద పన్ను లేదు. TDS లేదా పన్ను రాయితీ కూడా ఈ స్కీమ్‌పై వర్తించదు. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కిందకు రాదు. మీ డిపాజిట్‌పై మీరు పొందే వడ్డీ అంటే ఈ పథకంలో పెట్టుబడిపై పన్ను విధించబడుతుంది. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసినప్పుడు, మీరు దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ‘ఇతర వనరుల నుండి ఆదాయం’ కేటగిరీలో చూపించాలి.

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం అప్పుడే.. ఆ లోపల రిటెన్షన్ ప్లేయర్‌ల వివరాలు..

ఈ పథకం కింద ఖాతాను తెరిచిన తర్వాత, మీరు ఒక సంవత్సరం పాటు డబ్బును విత్‌డ్రా చేయలేరు. అలాగే, మీరు దాని మెచ్యూరిటీ వ్యవధి పూర్తయ్యేలోపు అంటే 3 నుండి 5 సంవత్సరాల మధ్య విత్‌డ్రా చేస్తే, అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్‌లో 1 శాతం తీసివేయబడుతుంది. మళ్ళీ తిరిగి ఇవ్వబడుతుంది. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత మీరు డబ్బును ఉపసంహరించుకుంటే, మీరు పథకం యొక్క అన్ని ప్రయోజనాలను పొందుతారు. సాధారణ ఆదాయాన్ని కోరుకునే, రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి నెలవారీ ఆదాయ పథకం (MIS) మంచి ఎంపిక. పదవీ విరమణను ప్లాన్ చేయడానికి ఇది ఉత్తమ పథకం కూడా కావచ్చు.