Polycet 2025: నేడే పాలీసెట్ 2025 పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైన ‘నో ఎంట్రీ’..!
- నేడే పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష.
- హాజరు కానున్న 1,06,716 మంది అభ్యర్థులు
- 276 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా 'నో ఎంట్రీ'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polycet 2025: నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా.. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష జరుగుతుంది. నేడు (మంగళవారం) రోజున ఉదయం 11.00 గం. నుండి మధ్యాహ్నం 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా జరగనుంది.
Read Also: LRS Scheme: మే 31 వరకు ఎల్‌ఆర్‍ఎస్ రాయితీ గడువు పొడిగించిన ప్రభుత్వం..!
Also Read
ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,716 మంది అభ్యర్థులు 276 పరీక్ష కేంద్రాలలో హాజరవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగానే అనుమతిస్తారు. కాబట్టి, హాజరయ్యే వారు ఉదయం 10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక పరీక్ష ఉదయం 11.00 గం. ప్రారంభం తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోనికి అనుమతించబడరు.
Read Also: Sachin Tendulkar: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పై సచిన్ టెండూల్కర్ భావోద్వేకం..!
ఇక పరీక్షా కోసం వెళ్లే విద్యార్థులు HB బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తీసుక వెళ్ళాలి. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కానివారు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఐడి ప్రూఫ్ కచ్చితంగా తెచ్చుకోవలెను. అలాగే పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్, మరే ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబడవు. విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని గుర్తించడానికి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుండి SBTET TG యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని, పరీక్షా కేంద్రం లోకేషన్ కై POLYCET Exam సెంటర్ లొకేటర్ టాబ్ ని తెరవండి. అక్కడ మీ వివరాలు అందిస్తే.. మీ సెంటర్ కు ఎలా చేరుకోవాలో సులువుగా తెలుసుకోవచ్చు.
తాజావార్తలు
-
లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..