Site icon NTV Telugu

Tejashwi Yadav: లాలూ వారసుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు.. ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు!

Bigshocklalu Yadav Tejashwi

Bigshocklalu Yadav Tejashwi

Tejashwi Yadav: బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బీహార్ ప్రతిపక్ష నాయకుడు RJD పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్‌కు అతి త్వరలో పార్టీలో ఒక ప్రధాన బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం బయటికి వచ్చిన తర్వాత RJD లో ఆయన పట్టాభిషేకం గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే తేజస్వి యాదవ్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: IND vs NZ: రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్‌కు దూరమవుతాడా?.. ODI సిరీస్‌లో ఘోరంగా విఫలం

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తేజస్వి యాదవ్ జనవరి 25న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులతో సహా సీనియర్ నుంచి జూనియర్ స్థాయి నాయకుల వరకు పాల్గొంటారు. ఈ సమావేశంలోనే తేజస్వి యాదవ్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత.. పార్టీ సంస్థాగత సమగ్ర పరిశీలనలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత RJD నిర్వహిస్తున్న తొలి జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు వయస్సు పెరగడం, అనారోగ్యం కారణంగా పార్టీలో తేజస్వి యాదవ్‌కు మరిన్ని బాధ్యతలు అప్పగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారిక పదవిలో లేనప్పటికీ, తేజస్వి చాలా కాలంగా పార్టీ వ్యూహాత్మక, సంస్థాగత, రాజకీయ నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.

READ ALSO: Washing Machine: మీ వాషింగ్ మెషీన్ నుంచి ఇలాంటి శబ్దాలు వస్తున్నాయా? జాగ్రత్తా!

Exit mobile version