Site icon NTV Telugu

Lok sabha elections: సోమవారం పోటీపడుతున్న ప్రముఖులు వీరే

Ts Ap

Ts Ap

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. సోమవారం నాల్గో విడత పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 10 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం పార్లమెంట్ ఎన్నికలకే ఓటింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో అధికార వైసీపీ-కూటమితో నువ్వానేనా అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్లంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. రైళ్లు, బస్సులు, విమానాలు, కార్లు ఏపీ వైపే ఎక్కువగా వెళ్తున్నాయి.

ఇది కూడా చదవండి: Sneha: ఒక్కసారి వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోను.. అందుకే.. స్నేహ షాకింగ్ కామెంట్స్

అయితే సోమవారం జరగబోయే నాల్గో దశ పోలింగ్‌లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ఏపీలో పులివెందుల నుంచి సీఎం జగన్, కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి నారా లోకేశ్, పిఠాపురం నుంచి పవన్‌కల్యాణ్, రాజంపేట లోక్‌సభ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజమండ్రి లోక్‌సభ నుంచి పురందేశ్వరి, కడప లోక్‌సభ నుంచి వైఎస్.షర్మిల పోటీలో ఉన్నారు. ఇక తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: RCB vs DC: మమ్మల్ని ఓడించడం ఢిల్లీకి కష్టమే: బెంగళూరు కోచ్

ఇక ఆయా రాష్ట్రాల్లో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో పాటు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు మహువా మోయిత్రా (కృష్ణానగర్, పశ్చిమబెంగాల్), శత్రుఘ్న సిన్హా (అసన్సోల్, పశ్చిమ బెంగాల్), బీజేపీ అగ్రనేతలు గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్, బీహార్), అర్జున్ ముండా (ఖుంటి, జార్ఖండ్) నాలుగో విడతలో పేరుగాంచిన రాజకీయ నాయకులు ఎన్నికల బరిలో ఉన్నారు.

నాల్గో దశలో లోక్‌సభ స్థానాలు ఇవే..
ఏపీ (25), తెలంగాణ (17), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ & కాశ్మీర్ (1) లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత సోమవారం జరగనుంది. అనంతరం మే 20, 25,  జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి: EVM Distribution Center: ఈవీఎం పంపిణీ కేంద్రంలో అస్వస్థతకు గురైన ఉద్యోగి..

Exit mobile version