NTV Telugu Site icon

Bike Romance: రన్నింగ్ బండిపై రొమాన్స్.. రాచ మర్యాదలు చేసిన పోలీసులు

Romance2

Romance2

Bike Romance : సినిమాలను చూసి తామేదో హీరోహీరోయిన్లు అనుకుని రోడ్డుపై బైక్ రొమాన్స్ చేస్తూ ఓ యువజంట కెమెరాకు చిక్కారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకర రీతిలో డ్రైవింగ్ చేస్తూ పక్కవారిని ఇబ్బందికి గురిచేశారు. ఇలా రెచ్చిపోయిన జంటకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకర రీతిలో డ్రైవ్ లో సాగిన చోడవరం ప్రాంతానికి చెందిన అజయ్(22), యువతి19) లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విశాఖ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు బయటకు వచ్చాక కూడా వారి కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు.

Read Also: Shocked Woman: సార్ ఐయామ్ ప్రెగ్నెంట్.. హో కంగ్రాట్స్.. యూఆర్ డిస్మిస్డ్

గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో అజయ్ జంట నడిరోడ్డుపైనే బరితెగించారు. పట్టపగలు.. పబ్లిక్‌లో బైకుపై హెల్మెట్ కూడా లేకుండా ఒకరికెదురు మరొకరు కూర్చొని రెచ్చిపోయారు. అక్కడితో ఆగలేదు.. అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఇంకా చెప్పలేని పనులు చేసింది. వారి వెనుక ఓ ఫామిలీ కారులో వెళ్తూ.. ఇదేం పని.. మీకు బుద్ది ఉందా అని అడిగినా.. ఏమాత్రం వినిపించుకోకుండా.. వారి పని వారు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే.. వారి గుండె ఆగి పోతుందని.. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కామెంట్స్ చేశారు.

Show comments