NTV Telugu Site icon

Rolls Royce: రోల్స్ రాయిస్ కారును పెట్రోలింగ్ కి వాడుతున్న పోలీసులు.. ఎక్కడో తెలుసా?

New Project (13)01

New Project (13)01

సాధార‌ణంగా కాస్ట్‌లీ కారేంటంటే, రోల్స్‌రాయిస్ అని అంద‌రూ చెబుతారు. అది నిజ‌మే. ఓ పెద్ద ప‌డ‌వ‌లా హొయ‌లొలికించే కార్లకు రోల్స్‌రాయిస్ ప్రసిద్ధి. రోల్స్‌రాయిస్ ఫాంట‌మ్ బాగా పాపుల‌ర్‌ కార్‌. కేవ‌లం ముగ్గురి కోసం త‌యారుచేయ‌బ‌డ్డ ఓ కారు ఇప్పుడు ధ‌ర‌ప‌రంగా సంచ‌లనం సృష్టిస్తోంది. సాధార‌ణంగా కాస్ట్‌లీ కారేంటంటే, రోల్స్‌రాయిస్ అని అంద‌రూ చెబుతారు. అది నిజ‌మే. ఓ పెద్ద ప‌డ‌వ‌లా హొయ‌లొలికించే కార్లకు రోల్స్‌రాయిస్ ప్రసిద్ధి. రోల్స్‌రాయిస్ ఫాంట‌మ్ బాగా పాపుల‌ర్‌ కార్‌. దీని విలువ దాదాపు 10 కోట్ల వ‌ర‌కు ఉంటుంది.

Read more : Telangana Exit Polls: తెలంగాణలో బీజేపీ సంచలనం.. 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని అంచనా..

కాగా.. తాజాగా ఇలాంటి ఖరీదైన కారును పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పెట్రోలింగ్‌కు వాడుతున్నారు. ఫ్లోరిడాలోని మియామీ నగరంలో పోలీసులు విలాసవంతమైన రోల్స్‌రాయిస్‌ను ఉపయోగించి నగరమంతా పెట్రోలింగ్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అక్కడి పోలీసులు. అసలు ఆ కారు ఎక్కడమే గొప్పగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది- సెలెబ్రిటీలూ ధనవంతులూ మాత్రమే వాడే రోల్స్‌రాయిస్‌ను ప్రపంచంలోనే తొలిసారి పెట్రోలింగ్‌కు వాడి రికార్డు సృష్టిస్తోంది మియామీ పోలీసు డిపార్ట్‌మెంట్‌. రోల్స్‌రాయిస్‌ ఘోస్ట్‌ మోడల్‌ అయిన ఈ కారు ధర రూ. 8 కోట్లకు పైమాటే. ఈ మధ్య మియామీ పోలీసు శాఖలో చేరడానికి యువత ఉత్సాహం చూపకపోవడంతో ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఈ ప్రయత్నం చేశారట అక్కడి పోలీసులు అధికారులు.