NTV Telugu Site icon

Terror Conspiracy Case: నేడు సిరాజ్, సమీర్లను కస్టడికి తీసుకోనున్న పోలీసులు

Nia

Nia

ఉగ్ర కుట్ర కేసు నిందితులు సిరాజ్, సమీర్ లను కేంద్ర కారాగారం నుంచి విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. సిరాజ్ సమీర్ లను విజయనగరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏడు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. నిన్న రాత్రి 10:30 నిమిషాలకు విజయనగరం పోలీసులకు సిరాజ్, సమీర్ల పోలీస్ కస్టడీ అనుమతులు పేపర్స్ అందడంతో ఉదయాన్నే సెంట్రల్ జైలుకు చేరుకున్నారు విజయనగరం పోలీసులు. రెండు వాహనాల్లో విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు విజయనగరం పోలీసులు.

Also Read:Terror Conspiracy Case: నేడు సిరాజ్, సమీర్లను కస్టడికి తీసుకోనున్న పోలీసులు

కస్టడీలో సిరాజ్, సమీర్ లను టూ టౌన్, ఎబ్ ఐ ఏ పోలీసులు విచారించనున్నారు. పోలీసుల విచారణలో మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల జనరద్దీ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ గ్యాంగ్. ముస్లిమేతరులు, ఆర్ ఎస్ ఎస్ సభ్యులే టార్గెట్ గా ప్రణాళిక రచించినట్లు గుర్తించారు. రాకెట్ లాంచర్లతో విధ్వంసానికి స్కెచ్. ప్రధాన సూత్రధారుడు సిరాజ్ గా గుర్తించారు. సిరాజ్ కు సౌదీ, ఒమన్ దేశాలతో పాటు పంజాబ్, ముంబై, కలకత్తాలోని పలువురు హ్యాండ్లర్స్ తో లింకులు ఉన్నట్లు గుర్తించారు. మరికొంత మంది కోసం పలురాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు అధికారులు. ఇప్పటికే ఆరుగురు పేర్లు ఎఫ్ ఐ ఆర్ లో పొందుపరిచారు పోలీసులు. మరికొందరి పాత్ర పై ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.