NTV Telugu Site icon

Terror Bid Foiled: పోలీస్‌ కస్టడీకి సిరాజ్‌, సమీర్‌.. 5 రోజులపాటు విచారించనున్న పోలీసులు

Nia

Nia

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్రను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసి.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్‌లో మరొకరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా సిరాజ్‌, సమీర్‌లను పోలీస్‌ కస్టడీకి ఇచ్చింది కోర్టు. 5 రోజులపాటు ఇద్దరిని విచారించనున్నారు పోలీసులు. సిరాజ్‌, సమీర్‌ల బ్యాంకు లాకర్లను ఓపెన్‌ చేయనున్నారు. ఇప్పటికే సిరాజ్‌ బ్యాంకులో రూ.45లక్షల నగదు గుర్తించారు. సిరాజ్‌కు డీసీసీబీ బ్యాంకులో లాకర్లు ఉన్నట్లు గుర్తించారు.

Also Read:Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోల హతం.. మృతుల్లో అగ్రనేత!

రెండ్రోజులుగా బ్యాంకు లాకర్లు ఓపెన్‌ చేసేందుకు తండ్రి ప్రయత్నం.. లాకర్లు ఓపెన్‌ కాకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చాడు. దుబాయ్‌ నుంచి ఇమ్రాన్‌ డబ్బులు పంపించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. సిరాజ్‌ దగ్గర ఉన్న డబ్బులతో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వరంగల్‌, బెంగళూరు, ముంబైలోని యువకుల పాత్రపై పోలీసుల ఆరాతీస్తున్నారు.

Also Read:Rains: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు కురిసే అవకాశం

పేలుళ్ల కుట్ర కోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్, సమీర్ కేసు లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో విద్వేషాలు.. సున్నిత మనసులను తమ బావాజలానికి ఆకర్షితులుగా చేస్తున్న సౌదీ హ్యాండ్లర్లు.. మ్యాజిక్ లాంతర్ అనే కొత్త పంథ ద్వారా కార్యకలాపాలు.. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ లలో పోస్టులు.. వీటికి స్పందించి అనుకూలంగా పోస్టులు పెట్టిన వారిని టార్గెట్ చేస్తున్న సౌదీ హ్యాండ్లర్లు.. ప్రతినిత్యం వారి ఖాతాపై ప్రత్యేక నిఘా..

Also Read:US: అత్యంత శక్తివంతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థను పరిచయం చేసిన ట్రంప్

తమను తమ వైపు అనుకూలంగా మలుచుకునే పోస్టులు.. సంస్థ సానుభూతిపరులతో పరిచయం చేయించి సమావేశం ఏర్పాటు.. వారికి కావలసిన నిధులు సమకూర్చుతున్న సంస్థ.. వీరిని ఎప్పటికప్పుడు ఆపరేటింగ్ చేస్తున్న సౌదీ హ్యాండ్లర్లు.. అలా సౌదీ హ్యాండ్లర్లకు చిక్కిన సమీర్, సిరాజ్.. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులుగా మారిన సమీర్, సిరాజ్. ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ఏజెఎన్సీల దూకుడు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ కుటుంబసభ్యుల కదలికలపై దర్యాప్తు సంస్థలు గట్టి నిఘా ఉంచాయి.

Also Read:Andhra Pradesh: కువైట్‌ ప్లైట్‌లో మిస్సైన మనోహర్ కథ విషాదాంతం

సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదును గుర్తించారు. కేసు నేపథ్యంలో సిరాజ్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అయితే డీసీసీబీ బ్యాంక్‌లో ఉన్న లాకరు తెరిచేందుకు సిరాజ్ తండ్రి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఖాతాను సీజ్ చేయడంతో లాకర్ తెరవటానికి కుదరదని సిరాజ్ తండ్రికి బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయంపై రెండు రోజుల పాటు బ్యాంక్ అధికారులను సిరాజ్ తండ్రి కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏఎస్‌ఐగా పని చేస్తున్న సిరాజ్ తండ్రితో పాటు కుటుంబ సభ్యుల కదలికలపై దర్యాప్తు సంస్థలు మరింత నిఘా పెట్టాయి.