Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు

Prabhakar Rao

Prabhakar Rao

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా పోలీసులు ప్రకటించనున్నారు. పలుమార్లు విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్నారు. ప్రభకర్ రావు ను ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు మార్గం సుగమం అయ్యింది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. కాగా జనవరిలోనే పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read:Gold Rates: ఒక్కరోజులోనే ఇంత మార్పా.. రూ. 2,400 పెరిగిన తులం గోల్డ్ ధర

ఇరువర్గాల వాదనల అనంతరం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ప్రభాకర్ రావు గడువులోపు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలనీ ఆదేశించింది. గడువులోపు హాజరుకాకుంటే న్యాయస్థానం ప్రకటిత నేరస్థుడిగా గుర్తించనుంది. ప్రకటిత నేరస్థుడిగా ప్రకటిస్తే ప్రభాకర్ రావు స్థిర,చర ఆస్థులను జప్తు చేసే అవకాశం ఉంది. సాధారణ ప్రజలు ఎవరైనా ప్రభాకర్ రావును గుర్తిస్తే పట్టుకునేందుకు వీలు కలుగనుంది.

Exit mobile version