NTV Telugu Site icon

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతోపాటు, మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది.. ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఆయన కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.. అయితే, రేపటి వరకు అరెస్టు చేయొద్దని కోర్టు చెప్పిన నేపథ్యంలో, రేపు కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకొని, అరెస్టు చూసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

Read Also: Tollywood News: టాలీవుడ్‌లో సమ్మె సైరన్‌.. షూటింగ్స్‌కి అంతరాయం!

మరోవైపు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోకుండా అతని చుట్టూ గట్టి పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ఎప్పుడు అరెస్టు చేస్తారో అనే సందిగ్ధత నెలకొంది పలనాడు జిల్లాలో.. కాగా, కౌంటింగ్‌కు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.. పిన్నెల్లి కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు నంబూరు శేషగిరిరావు.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఇదే సమయంలో.. ఈ నెల 6వ తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి.. పరిష్కరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌.. మరోవైపు.. నిన్న వెలువడి ఫలితాల్లో పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ విజయం సాధించింది.. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఘన విజయాన్ని అందుకున్న విషయం విదితమే.