Police Station Explosion: పోలీస్ స్టేషన్‌లో పేలుడు, 25 మంది పోలీసులకు గాయాలు..

  • వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.
  • 25 మంది పోలీసులకు గాయాలు..
  • ఒక పిల్లవాడు మరణం.
Blast

Blast

Police Station Explosion: వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక పిల్లవాడు మరణించాడు. గాయపడిన వారిలో ఎక్కువ మంది పోలీసులే. ఈ ఘటన పెషావర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని స్వాబీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెంట్రల్ పోలీస్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం, పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులో ఉన్న డిపో లోపల “షార్ట్ సర్క్యూట్ కారణంగా” పేలుడు సంభవించింది.

Bruxism Teeth: నిద్రలో పళ్లు కొరుక్కోకుంటున్నారా.? ఇలా చేసి ఉపశమనం పొందండి!

×
×
Ad

రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను బచాఖాన్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. పలువురు గాయపడ్డారని, భవనం పైభాగం కూలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.