NTV Telugu Site icon

Attack on CM YS Jagan Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. దర్యాప్తు ముమ్మరం..

Ys Jagan

Ys Jagan

Attack on CM YS Jagan Case: సీఎం వైఎస్‌ జగన్‎పై రాయి దాడి కేసులో దర్యాప్తు స్పీడప్‌ అయింది. 20 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్‌టవర్‌ నుంచి వెళ్లిన కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్‌కమింగ్, ఔట్‌గౌయింగ్ కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా, వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన క్లూస్ టీమ్స్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేస్తున్నారు. కేసును దర్యాప్తును డీజీపీ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంత దూరం నుంచి జగన్‌కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.

సీఎం జగన్‌ వాహనానికి ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‎తో పాటు పోలీస్ వాహనాలకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‎ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాలకు కెమెరాలు ఉన్నప్పటికీ ఫోకస్ లైట్స్‎తో క్లియర్‎గా వీడియోలు కనిపించడం లేదు. గంగానమ్మ గుడి ఐసోలేషన్ లోకేషన్లో కాల్ డేటా డంప్, సాంకేతిక డేటా ఫిల్టల్ చేస్తున్నారు. ఈ కేస్ దర్యాప్తులో దాదాపు 20 టీమ్‎లు పని చేస్తున్నాయి. విజయవాడలో రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తుల కార్యకలాపాలపైనా ఫోకస్‌ చేశారు. రౌడీ షీటర్లు ఏం చేస్తున్నారు..? ఎక్కడున్నారనేదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు.. దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. నిందితుల గురించి ఏదైనా సమాచారం ఉన్నా, తెలిసినా తమకు తెలపాలని పోలీసులు కోరారు. దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. 9490619342, 9440627089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సెల్‌ ఫోన్‌ వివరాలు, వీడియో రికార్డింగ్స్‌ ఉన్నా పంపాలన్నారు. వివరాలు తెలిపిన వారి పేపర్లను రహస్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.

మరోవైపు, రాయి దాడి తర్వాత మళ్లీ జనంలోకి వచ్చారు సీఎం జగన్‌. నిన్నంతా రెస్ట్‌ తీసుకున్న జగన్‌.. 15వ రోజు బస్సుయాత్రలో పాల్గొన్నారు. దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు. క్రేన్లతో గజమాలలు వేయకుండా నియంత్రించాలని పోలీసులకు సీఎం సెక్యూరిటీ సూచించారు. బస్సుయాత్రలో సీఎంకు గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. సీఎం పర్యటించే మార్గంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలందాయి. మరీ అవసరమైతేనే బస్సు పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తల అనుమతించాలని తెలిపింది. వీలైనంత వరకు బస్సులో కూర్చునే యాత్ర చేయాలని నిఘావర్గాలు సూచించాయి. అంతే కాకుండా సభల్లో ర్యాంప్‌ వాక్‌ కూడా చేయొద్దని సూచించింది.

Show comments