Site icon NTV Telugu

Krishna: అవనిగడ్డలో 45 రోజుల పసిపాప మృతి కేసును ఛేదించిన పోలీసులు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Arrest

Arrest

కృష్ణాజిల్లా అవనిగడ్డలో 2 రోజుల క్రితం మృతి చెందిన 45 రోజుల పసికందు మృతి కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లి పసిపాపను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పాప వైద్యానికి ఖర్చు అవుతోందని అత్త సూటి పోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైంది కన్న తల్లి. తన బిడ్డకు అనారోగ్యం నయం కాదేమో అని గుండెలవిసేలా రోదించింది. దీంతో కన్న బిడ్డను చెరువులో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. పసి పాప మృతికి కారకులైన తల్లి రావి సాయి చైతన్య, నాయనమ్మ రావి వాణి లపై కేసు నమోదు చేసిన మోపిదేవి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని అవనిగడ్డ కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజులు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పాప మేనమామ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Exit mobile version